LLB Exams: ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Sakshi Education
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
LLB Exams LLB semester exam schedule released
అక్టోబర్ 17, 19, 21, 25వ తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్విహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కేయూ పరిధిలో ఎల్‌ఎల్‌ఎం రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 16నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మొదటి పేపర్ అక్టోబర్ 16న, రెండో పేపర్ 18న, మూడో పేపర్ 21 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికా రి డాక్టర్ నాగరాజు తెలిపారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడొచ్చని సూచించారు.