Engineering Semester Exams: ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం..
Sakshi Education
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థులకు 3, 7 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ సందర్శించి పరిశీలించారు. అనంతరం వర్సిటీ సైన్స్, ఆర్ట్స్ కళాశాలలను సందర్శించారు.
Engineering Semester Exams
తరగతులు జరుగుతున్న తీరును పరిశీలించారు. మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి 224 మందికి 223 హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని ఆర్‌యూసీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ హరిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు 74 మంది, ఏడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి 167 మంది హాజరైనట్లు తెలిపారు. వీసీతో పాటు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు ఉన్నారు.