Skip to main content

Dr.B.R. Ambedkar Open University Admissions 2024-25 : అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : డా.బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. రాష్ట్రంలోని న‌లుమూలల నుంచి ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటారు.
Dr BR Ambedkar Open University Admissions 2024-25

తాజాగా డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్సీ) కోర్సులు, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం ఈ వర్సిటీ జులై 27వ తేదీన‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

కేవ‌లం తెలంగాణ‌లో మాత్రమే..

dr br  ambedkar open university

ఈ విద్యాసంవత్సరం నుంచి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశాలు చేపట్టనుంది. తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలంగాణలోని స్టడీ సెంటర్లలో మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని వర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. దీంతో అంబేడ్కర్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..!
డిగ్రీ, పీజీలోని ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ తెలిపింది. పూర్తి వివ‌రాలను www.braouonline.in, www.braou.ac.in, https://www.braouonline.in/MISC/UGPGProspectus.aspx వెబ్‌సైట్‌ల ద్వారా పొందొచ్చు. 

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2024-25 ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 29 Jul 2024 07:43PM
PDF

Photo Stories