INSPIRE MANAK: ఇన్‌స్పైర్ మనక్ ప్రదర్శనలు.. ఈ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలి
అందులో భాగంగానే 2022–23 సంవత్సరంలో ఇన్‌స్పైర్ మనక్ ప్రదర్శనలు నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి ఆలోచనలు ఆహ్వానించింది. ఇందుకోసం జిల్లా నుంచి విద్యార్థులు పలు ప్రాజెక్టుల ఆలోచనలను ఆన్‌లైన్‌లో పంపారు.
వాటిలో 143 ప్రాజెక్టులు జిల్లాస్థాయిలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఆ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు విద్యార్థుల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేశారు. వాటికి సంబంధించి గతేడాది నవంబర్‌లోనే ప్రదర్శన నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. సమయం తక్కువగా ఉండటం వల్ల ఈసారి ఇన్‌స్పైర్ మనక్ ప్రదర్శనలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
చదవండి: ISRO Success: ఇస్రో ప్రయోగం విజయవంతం.. కొత్త ఏడాదోలో మొదటి సక్సెస్‌గా నిలిచిన ప్రయత్నం..!
18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్..
జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న 143 ప్రాజెక్టులను విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులకు సంబంధించి వీడియో, ఆడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒక్కో వీడియో నిడివి రెండు నిమిషాలు. డాటా 30 ఎంబీ దాటకూడదని నిర్ణయించారు.
షెడ్యూల్ ఇలా..
ఈ నెల 18 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాజెక్టులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 19 నుంచి 25 వరకు మూల్యాంకనం చేస్తారు. ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న వాటిని ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు మూల్యాంకనం చేస్తారు. ఆ తర్వాత జాతీయ స్థాయికి ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు.
ముగ్గురు న్యాయ నిర్ణేతలు..
విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించేందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నుంచి ఒక్కరు, జిల్లా నుంచి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆ ముగ్గురు ఆన్‌లైన్‌లోనే పరిశోధనలు పరిశీలిస్తారు. ప్రతి నమూనాకు పది చొప్పున మార్కులు ఉంటాయి. ప్రతిభ ఆదారంగా మార్కులు కేటాయిస్తారు. ప్రతి జిల్లాలో ఎంపికై న ప్రదర్శనల్లో పది శాతం ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు.