Skip to main content

ISRO Success: ఇస్రో ప్రయోగం విజయవంతం.. కొత్త ఏడాదోలో మొదటి సక్సెస్‌గా నిలిచిన ప్రయత్నం..!

కొత్త ఏడాదో ఇస్రో చేసిన మొదటి ప్రయత్నం. 2024 జనవరి 1న, పీఎస్‌ఎల్‌వీ సీ-58 రాకెట్‌ను ఆవిశ్కరించారు శాస్త్రవేత్తలు. శ్రీహరికోటలో జరిగిన ఈ ప్రయత్నంతో దక్కిన ఫలితం గురించి పూర్తి వివరాలను వెల్లడించారు..

Live Updates..

పీఎస్‌ఎల్‌వీ సీ-58 విజయవంతపై సీఎం జగన్‌ హర్షం

►ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

► నూతన సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించారు.

►అనుకున్న రీతిలోనే ఉపగ్రహాన్ని  కక్ష్యలోకి ప్రవేశపెట్టటం సంతోషకరం.

►భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి.

►పీఎస్‌ఎల్‌వీ సీ-58 ప్రయోగం విజయవంతం. 

►2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించిన అమెరికా.

►అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా ఘనత దక్కించుకున్న భారత్‌ .

►కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్‌.

►శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు జరుపుకుంటున్న సంబరాలు.

►శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ 58.

ISRO To Launch PSLV-C58: జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ సీ58 ప్రయోగం

 

►ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లు. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం.

►2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజునే ఇస్రో తొలి ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నిర్వహించనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైంది. ఇస్రో ఎక్స్‌ రే  పొలారి మీటర్‌ శాటిలైట్‌(ఎక్స్‌పో శాట్‌)ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్‌ మిషన్‌ కావడం విశేషం.

Year Ender 2023: ఈ సంవ‌త్స‌రంలో ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!

►కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేరుకోనుంది. 

►అనంతరం రాకెట్‌లో నాలుగో స్టేజ్‌ అయిన పీఎస్‌4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో తిరువనంతపురం ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్‌ కాలేజ్‌ విద్యార్థినులు తయారుచేసిన విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. 

Covid in Kerala: కోవిడ్‌-19 కి కొత్త వేరియంట్‌ ఇదే.. దీనిపై క్లరిటీ!

►కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్‌ పో శాట్‌ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్‌లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. 

Covid Subvariant JN.1: కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. దేశంలో మొద‌టి కేసు ఎక్క‌డ‌ నమోదయ్యిందంటే..!

►ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్‌ మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్‌ పేలోడ్‌ అంతరిక్షంలోని బ్లాక్‌హోళ్లు, న్యూట్రాన్‌ నక్షత్రాలు, యాక్టివ్‌ గలాటిక్‌ న్యూక్లై, పల్సర్‌ విండ్‌, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్‌రోస్కోపిక్‌ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్‌ 3, ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

Published date : 02 Jan 2024 11:22AM

Photo Stories