ISRO To Launch PSLV-C58: జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ సీ58 ప్రయోగం
Sakshi Education
శ్రీహరికోట షార్‌లోని మొదటి ఫ్రయోగవేదిక నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ58 రాకెట్ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
డిసెంబర్ 31వ తేదీ ఉదయం 9.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో 30వ తేదీన ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరిస్‌లో అత్యంత తేలికై న పీఎస్‌ఎల్‌వీ–డీఎల్ ప్రయోగం నిర్వహించేందుకు రాకెట్ అనుసంధానం పనులను డిసెంబర్ 27(బుధవారం) నాటికి పూర్తి చేశారు.
ఈ రాకెట్ ద్వారా ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే 480 కిలోల ఎక్స్‌పోశాట్ ఉపగ్రహం ప్రయోగించనున్నారు. దీంతో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన కేజీ బరువు కలిగిన వియ్‌శాట్ అనే బుల్లి ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. భూమికి అత్యంత తక్కువ దూరంలో ఉన్న లియో ఆర్బిట్‌లోకి ఈ రెండు ఉపగ్రహాలను పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు నాలుగు దశల రాకెట్ అనుసంధాన పనుల చిత్రాలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
ISRO astronaut's Moon Mission: చందమామపై భారతీయ వ్యోమగాముల అడుగే తరువాయి!
Published date : 29 Dec 2023 11:27AM