Skip to main content

Medical Fee: ఆ ఫీజులను సర్కారుకు ఇవ్వాల్సిందే!

Fees have to be paid to the government
Fees have to be paid to the government
  •      అడ్మిషన్లు రద్దు అయిన ఆ 3 మెడికల్‌ కాలేజీల విద్యార్థులను సర్దుబాటు చేయాల్సిందే... 
  •      జాతీయ వైద్య కమిషన్‌ స్పషీ్టకరణ  
  •      సర్దుబాటు సాధ్యం కాదంటున్న అధికారులు.. 

సాక్షి, హైదరాబాద్‌: మూడు మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల రద్దు నేపథ్యంలో విద్యార్థుల సర్దుబాటు అంశం ఇంకా కొలిక్కిరాలేదు. మరోవైపు వైద్యవిద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను ప్రభుత్వానికి ఆ కాలేజీలు అప్పగించాలని జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 450 ఎంబీబీఎస్, 70 పీజీ మెడికల్‌ సీట్లు కోల్పోయిన ఆ మూడు కాలేజీలకు సూచించింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రాష్ట్రంలో మూడు ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సీట్లల్లో చేరిన నెలరోజుల్లోపే ఆయా అడ్మిషన్లను రద్దు చేస్తూ ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థులు, అధికారులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. తరగతులు మొదలైన నెలలోనే అడ్మిషన్లను రద్దు చేసినందున విద్యార్థులు చెల్లించిన ఫీజులను ప్రభుత్వానికి అప్పగించాలని వివరించింది. ఆ విద్యార్థులను ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. కాలేజీల నిబంధనలను విద్యార్థులు అనుసరిస్తారని, ఆ ప్రకారం వారికి తగు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ విద్యార్థుల మెరిట్, ఇతర కాలేజీల్లో సీట్ల లభ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వారిని సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. ఏ కాలేజీల్లో విద్యార్థులను సర్దుబాటు చేసినా అక్కడున్న ఎంబీబీఎస్‌ సీట్లు గరిష్టంగా 250కు మించకూడదని పేర్కొంది. పీజీ విద్యార్థుల విషయంలో డి్రస్టిక్ట్‌ రెసిడెంట్‌ ప్రోగ్రామ్‌ కోసం అందుబాటులో ఉన్న సీట్లతో సంబంధం లేకుండా జిల్లా ఆసుపత్రుల్లో 3 నెలలపాటు పనిచేయడానికి అనుమతించవచ్చని తెలిపింది.  

Also read: నీట్ పీజీలో కోనసీమ జిల్లా యువతికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్

విద్యార్థులు వర్సెస్‌ అధికారులు 
ఎన్‌ఎంసీ చెప్పినట్లుగా తమను ఇతర మెడికల్‌ కాలేజీల్లో సర్దుబాటు చేయాలని విద్యార్థులు కోరుతుండగా, అధికారులు మాత్రం అంతమంది విద్యార్థులను సర్దుబాటు చేయడం కష్టమని అంటున్నారు. పైగా ఫీజుసహా ఎన్నో చిక్కులు వస్తాయంటున్నారు. ప్రస్తుతం సీట్లు రద్దయిన కాలేజీల్లోనే ఎలాగైనా తిరిగి అడ్మిషన్లు ఇచ్చి అక్కడే కొనసాగిం చేలా ఎన్‌ఎంసీకి లేఖ రాస్తామని, మౌలిక సదుపాయాలు కలి్పంచాలని కాలేజీలను ఆదేశించాలని కోరుతామని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, విద్యార్థులు మాత్రం తాము మౌలిక సదుపాయాలు, ఫ్యాకలీ్ట, హాస్టల్‌ వసతి వంటివేవీ లేని ఈ కాలేజీల్లో చదవబోమని, తమ జీవితాలను నాశనం చేయొద్దని, ఇతర కాలేజీల్లోనే సర్దుబాటు చేయాల ని కోరుతున్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు మాత్రం తాము ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని చెబుతున్నారు.   

Also read: Medical Colleges: 5 వైద్య కళాశాలలు రెడీ

Published date : 04 Jun 2022 05:08PM

Photo Stories