Govt Medical College: మెడికల్ కళాశాలకు అసోసియేట్ ప్రొఫెసర్లు
తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ ఉన్నతాధికారులు ఖమ్మం కాలేజీకి ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లను కేటాయించారు. జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, ఫిజియాలజీ, డెర్మటాలజీ, గైనకాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని నియమించగా వారిలో సదానందం, తులసి ఆగస్టు 4న విధుల్లో చేరారు.
చదవండి: Jobs: వెద్య కళాశాలల్లో ఎస్‌ఆర్‌ల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు ఇవే..
ఈసందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా అక్టోబర్ నుంచి బోధన మొదలవుతుందని తెలిపారు. ఇప్పటికే ఆరుగురు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 23 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 27 మంది సీనియర్ రెసిడెంట్లు, ఐదుగురు హౌస్ సర్జన్లు, 15 మంది డీపీఆర్‌లు కేటాయించారని, త్వరలోనే 80 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బందిని కేటాయించనున్నారని ప్రిన్సిపాల్ చెప్పారు.