ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలు అధికం
Sakshi Education
విజయనగరం అర్బన్: నూతన విద్యావిధానంలో డిగ్రీ విద్యార్ధులకు అమలు చేస్తున్న ఇంటర్న్‌షిప్ ద్వారా ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయని ఐకాన్ ఫార్మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పి.వాసు అన్నారు.
ఈ మేరకు స్థానిక మహరాజా అటానమస్ కళాశాలలో రసాయన శాస్త్రం విద్యార్ధులకు ‘జాతీయ విద్యా విధానం–2020’పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన వక్తగా పాల్గొన్నారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తృతీయ సంవత్సరం విద్యార్ధులు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ఐకాన్ ఫార్మాస్యుటికల్స్‌లో ల్యాబొరేటరీలో ఉద్యోగం పొందే విధంగా హెచ్‌పీఎల్‌సీ, ఐఆర్ స్పెక్ట్రో ఫోటో మేటర్ వంటి అధునాతన పరికరాలతో 6 నెలలపాటు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి, స్టూడెంట్స్ కన్వీనర్ వి.బాబ్జీ, అకడమిక్ కన్వీనర్ పీఎస్‌ఎన్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జి.చంద్రశేఖర్, టి.భారతి, కె.మాధురి, డి.పావని పాల్గొన్నారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
Published date : 11 Apr 2023 05:09PM