Skip to main content

Job Fair: నిరుద్యోగులకు జాబ్‌ మేళా

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో జూలై 25వ తేదీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్‌ జూలై 23న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Job Fair
నిరుద్యోగులకు జాబ్‌ మేళా

జోసిల్‌ లిమిటెడ్‌, ఫ్లిప్‌కార్ట్‌, మాస్టర్‌ మైండ్స్‌, హెల్త్‌కేర్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం టెన్త్‌, ఆపైన విద్యార్హతలు కలిగి, 18నుంచి 45ఏళ్ల లోపు వ యసు ఉన్న నిరుద్యోగులు మంగళవారం గుజ్జనగుండ్లలోని డీమార్ట్‌ ఎదుట ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూ చించారు.

చదవండి: Govt College: చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం

విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌ జిరాక్స్‌తో పాటు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాలని, ఇతర వివరాలకు తమ ప్రతినిధి పి.మణిదీప్‌ను 8074607278 నంబర్లో సంప్రదించాలని కోరారు.

చదవండి: Job Fair: 27న జాబ్‌మేళా

Published date : 24 Jul 2023 03:19PM

Photo Stories