Job Mela: 130 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు
Sakshi Education
కంచరపాలెం : జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో ఫిబ్రవరి 28న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయ్‌మెంట్ అధికారి నిట్టాల శ్యామ్ సుందర్ తెలిపారు. అపోలో ఫార్మసీ, ఎస్‌ఆర్ అకాడమిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల్లో 130 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు.
రిటైల్ ట్రైనీ, ఆఫీస్ అడ్మిన్, టెలీకాలర్, హోమ్‌కేర్, నర్సింగ్ స్టాఫ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎం/బి/డి ఫార్మసీ, ఎంఎల్‌టీ, జీఎన్‌ఎం, నర్సింగ్ ఉద్యోగాల బట్టీ ఉత్తీర్ణత సాధించిన 18–30 ఏళ్ల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు.
చదవండి: RRB Notification 2024: 9000 టెక్నీషియన్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో జాబ్ లోకేషన్ ఉంటుందన్నారు. ఆయా ఉద్యోగాన్ని బట్టి జీతం నెలకు రూ.10,500 – 20,000వరకు ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కంచరపాలెంలోని జిల్లా ఉపాఽధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.
Published date : 26 Feb 2024 01:01PM