Psychology Courses: సైకాలజీ కోర్సులతో ఉపాధి అవకాశాలు
Sakshi Education
కేయూ క్యాంపస్: సైకాలజీ కోర్సులతో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయని కాకతీయ యూనివర్సిటీ ఎస్డీఎల్‌సీఈ డైరెక్టర్ ఆచార్య వి.రామచంద్రం అన్నారు.
దూరవిద్యా కేంద్రంలో మార్చి 24న ఎమ్మెస్సీ సైకాలజీ చివరి సంవత్సరం విద్యార్థులకు తరగతుల ముగింపు సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 21వ శతాబ్దంలో సైకాలజిస్టుల అవసరం చాలా ఉందని, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఏకాగ్రత లోపం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు.
చదవండి: Latest Gurukul Admissions: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..
ప్రస్తుతం సైకాలజిస్టుల కౌన్సిలింగ్ సేవలు ప్రతీ రంగంలో అవసరమని పేర్కొన్నారు. ఈ కోర్సులు చేసే విద్యార్థులకు నిష్ణాతులచే బోధన, ప్రాక్టికల్స్ నిర్వహించినట్లు చెప్పారు. సైకాలజీ విభాగం ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం, డాక్టర్ నహిదాపర్వీన్, డాక్టర్ మాలతి, డాక్టర్ కందాల రామయ్య, జి.అపర్ణ పాల్గొన్నారు. అనంతరం చివరి సంవత్సరం విద్యార్థులతో ఫొటో సెషన్ నిర్వహించారు.
Published date : 25 Mar 2024 05:27PM