Skip to main content

Latest Gurukul Admissions: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..

Gurukul Admissions   Andhra Pradesh Gurukula Vidyalayas  Application form for Andhra Pradesh Gurukula Vidyalayas admission

చిలకలపూడి(మచిలీపట్నం): వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశం, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయం (మైనార్టీ బాలురు) జిల్లా కో–ఆర్డినేటర్‌ పి.వి.ఎస్‌.రాజేంద్రప్రసాద్ మార్చి 19వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25వ తేదీన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 87126 25035 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

 

Published date : 25 Mar 2024 10:11AM

Photo Stories