High Court: ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండండి
ఉద్యోగాల భర్తీపై వచ్చే తప్పుడు నోటిఫికేషన్లను, లెటర్లను తమ దృష్టికి తీసుకురావాలని కోరింది. తప్పుడు వాట్సాప్ సందేశాలు, నకిలీ నోటిఫికేషన్లను వ్యాప్తి చేసే వారిని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించింది. తప్పుడు హైకోర్టు లెటర్ ప్యాడ్ తయారు చేసి, హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) సంతకాన్ని స్కాన్ చేసి క్లర్క్ ఉద్యోగాలంటూ వాట్సాప్‌లో వ్యాప్తి చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు చర్యలు చేపట్టింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు సందేశాల వ్యాప్తి వెనుకున్న కుట్రదారులను, నేరస్తులను చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరింది. ఉద్యోగ ఆశావహులు, ఇతరులు కూడా హైకోర్టు భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో హైకోర్టు వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని కోరింది. ఉద్యోగ ప్రకటన మొదలు, భర్తీ వరకు ప్రతి విషయాన్నీ అందులో పొందుపరుస్తామని, ఆ వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) ఆలపాటి గిరిధర్ ఫిబ్రవరి 16న ఓ ప్రకటన విడుదల చేశారు.
చదవండి:
Supreme Court: రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు?
High Court: విద్యా కానుక టెండర్ నిబంధనలు సరైనవే..