AP CM YS Jagan Mohan Reddy : విద్యాశాఖపై.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. వారంలో మూడు రోజులపాటు..
వారంలో మూడు రోజులపాటు..
8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధపైనా సీఎం ఆరా తీశారు. వారంలో మూడు రోజులపాటు మూడు పీరియడ్ల మేర శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం మన బడి నాడు–నేడు పనులపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చాక బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా డబ్బు ఖర్చుచేస్తున్నామన్నారు.
చదవండి: CM YS Jagan Mohan Reddy: విద్యారంగానికి సీఎం జగన్ పెద్దపీట
పిల్లలకు రుచికరమై, పౌష్టికాహారాన్ని..
మెనూను మార్చి పిల్లలకు రుచికరమై, పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. రాగిజావను కూడా ప్రవేశపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ తగ్గకూడదు. నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ కూడా పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Also read: Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన