96 Faculty Jobs: ‘గాంధీ’లో 96 అధ్యాపక వైద్య పోస్టులు భర్తీ
సెలక్షన్ కమిటీ నేతృత్వంలో మార్చి 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టులను గౌరవ వేతనం, కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో గాంధీ మెడికల్ కాలేజీలోని 22 విభాగాల్లో 121 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సెలక్షన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కన్వీనర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ వెంకటాచారి, సభ్యులు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, వైస్ ప్రిన్సిపాల్స్ కృష్ణమోహన్, రవీందర్ నేతృత్వంలో మార్చి 16న ఉదయం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.
చదవండి: 46 Medical jobs Notification: వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వేర్వేరుగా ఇంటర్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. 3 ప్రొఫెసర్, 73 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 37 సీనియర్ రెసిడెంట్లు, 8 ట్యూటర్ మొత్తం 121 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, 2 ప్రొఫెసర్, 71 అసిస్టెంట్ ప్రొఫెసర్, 15 సీనియర్ రెసిడెంట్, 8 ట్యూటర్, మొత్తం 96 పోస్టులను భర్తీ చేసినట్లు సెలక్షన్ కమిటీ కన్వీనర్, గాంధీ ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి తెలిపారు.
చదవండి: 62 Jobs: మెడికల్ కళాశాలలో 62 పోస్టుల భర్తీకి ఆదేశాలు
ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికై న అర్హుల జాబితాను కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు వివరించారు.
Tags
- 96 Faculty Jobs
- faculty jobs
- medical jobs
- Gandhi Medical College
- Govt Medical Colleges
- Jobs
- Telangana News
- Latest News
- latest jobs
- GandhiHospital
- SecunderabadGandhiMedicalCollege
- FacultyPositions
- MedicalPosts
- SelectionCommittee
- CertificateVerification
- Interviews
- March16
- EligibleCandidates
- RecruitmentProcess
- sakshieducationlatest job notifications