Skip to main content

TSRJC CET 2022: జూన్‌ 6న పరీక్ష

TSRJC CET on June 6
TSRJC CET on June 6
  • 28 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు సంబంధించి జూన్‌ 6న అర్హత పరీక్ష టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌–22 నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40,281 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఈనెల 28 నుంచి హాల్‌టికెట్లు వైబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుందని, మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.  

Also read: TSBIE: ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

Published date : 19 May 2022 04:12PM

Photo Stories