10th Class Public Exam Question paper Leak : పదో తరగతి పబ్లిక్ పరీక్షల కొశ్చన్ పేపర్ కూడా లీకేజీ.. ఎక్కడంటే..?
ఈ కుంభకోణంలో ఇద్దరు ఉపాధ్యాయులను సూత్రధారులుగా గుర్తించినట్టు అస్సాం డీజీపీ జీపీ సింగ్ వెల్లడించారు. వీరిలో ఒకరిని అరెస్టు చేయగా.. మరో టీచర్ పరారీలో ఉన్నాడన్నారు. త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు చెప్పారు.
☛➤ TSPSC Paper Leak 2023 : టీఎస్‌పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా రద్దు..?
ఇంటి నుంచే..
మజులీ ప్రాంతంలోని లుహిత్ ఖబాలు హైస్కూల్ హెడ్‌మాస్టర్, పరీక్ష కేంద్రం ఇన్‌ఛార్జిగా ఉన్న ప్రణబ్ దత్తాను అరెస్టు చేసినట్టు డీజీపీ వెల్లడించారు. అతడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్టు చెప్పారు. మరో నిందితుడైన కుముద్ రాజ్‌ఖోవా.. లఖింపూర్‌లోని డఫ్లకటా హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నట్టు తెలిపారు. అతడు ప్రణబ్‌దత్తాకు సన్నిహితుడిగా గుర్తించామని డీజీపీ చెప్పారు. ప్రణబ్ దత్తా ఇంటి నుంచి కాలిబూడిదైన ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నామని.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. పరీక్ష పేపర్లను లీక్ చేసి పంపిణీ చేసిన గొలుసుకట్టు వ్యవస్థలను సైతం గుర్తించామన్నారు. 10వ తరగతి బోర్డు పరీక్షలో జనరల్ సైన్స్ ప్రశ్నపత్రం లీకైన కొద్ది రోజులకే అస్సామీ (లాంగ్వేజ్) పేపర్ సైతం లీక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
☛➤ 10 Days Schools Holidays : బ్రేకింగ్ న్యూస్.. 10 రోజులు స్కూళ్లకు సెలవులు.. కారణం ఇదే..
వైఫల్యానికి బాధ్యత తనదే..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ.. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వైఫల్యానికి బాధ్యత తనదేనన్నారు. తప్పు జరిగిందని అంగీకరిస్తున్నట్లు.. పేపర్ లీకేజీ వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించినట్టు నిన్ననే తెలిపారు. అస్సాంలో సోమవారం (మార్చి 13) జరగాల్సిన జనరల్ సైన్స్ పేపర్.. ఆదివారం రాత్రే బయటకు వచ్చినట్లు అస్సాం బోర్టు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ పరీక్షను రద్దు చేశారు.
పేపర్ లీక్‌పై సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు చేశారు. వాట్సప్‌లో పేపర్ లీక్ చేశారని.. ప్రశ్నపత్రం ఇచ్చేందుకు రూ.300 నుంచి రూ.3000 వరకూ ఒక్కొక్కరి వద్ద నుంచి వసూలు చేసినట్లు గుర్తించారు. పేపర్ లీక్ ఘటనలో మొత్తం 12 మంది విద్యార్థులుసహా 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు.