Skip to main content

CUCET: పీజీ ఎంట్రెన్స్‌లో విద్యార్థుల ప్రతిభ

సిద్దిపేటఎడ్యుకేషన్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(పీజీ) ప్రవేశ పరీక్షల్లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
CUCET
పీజీ ఎంట్రెన్స్‌లో విద్యార్థుల ప్రతిభ

ఆగ‌స్టు 29న‌ విడుదలైన పీజీ సెట్‌ ఫలితాల్లో కళాశాలకు చెందిన సుమారు 25 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ ప్రసాద్‌ మాట్లాడారు. కళాశాలకు చెందిన గడం శ్రీకాంత్‌ అనే విద్యార్థి సీయూసెట్‌లో అర్థశాస్త్రంలో 5వ ర్యాంకు సాధించాడన్నారు. ఫలితంగా కేరళ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీజీ చేసే అవకాశం వచ్చిందన్నారు. కెమిస్ట్రీలో 25 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు.

చదవండి: 5K Marathon: మారథాన్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి వాసం శ్రీనివాస్‌ ప్రత్యేక చొరవతీసుకుని విద్యార్థులకు ప్రత్యేకంగా నెల రోజుల పాటు కోచింగ్‌ అందించారని తెలిపారు. హర్యాన సెంట్రల్‌ యూనివర్సిటీలో నరేందర్‌, కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీలో జీవన్‌రెడ్డి కెమిస్ట్రీలో పీజీ సీట్లు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అర్థశాస్త్ర విభాగాధిపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భవాని, అధ్యాపకులు డాక్టర్‌ మల్లేశం, డాక్టర్‌ శ్రద్ధానందం, ఆంజనేయులు, డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ సుమలత, శ్యాంసుందర్‌, సలీంపాషా, బాలకిషన్‌, రవికుమార్‌లతో పాటు పీజీలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌ అభినందించారు.

చదవండి: Mega Job Mela: అప్రెంటిషిప్‌ కం జాబ్‌మేళా

Published date : 30 Aug 2023 04:12PM

Photo Stories