Skip to main content

5K Marathon: మారథాన్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

భూపాలపల్లి అర్బన్‌: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం, మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగే 5కే మారథాన్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను ఎంపిక చేసినట్లు మారి జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సదానందం తెలిపారు.
5K Marathon
మారథాన్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం, మారి సంస్థల ఆధ్వర్యంలో ఆగ‌స్టు 9న‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే ‘యూత్‌ ఫెస్ట్‌ – 2023’లో భాగంగా ‘రేస్‌ అగెనెస్ట్‌ హెచ్‌ఐవీ–రెడ్‌ రన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సదానందం పాల్గొని విద్యార్థులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు.

చదవండి: Tarun Bhaskar: చదువుపై ఆసక్తి లేదని నా మిత్రుడుకి చెప్పా.. ఇపుడు ఇలా.. విద్యార్థులతో చిట్‌చాట్‌

జిల్లా మారథన్‌లో పాల్గొన్న వారిలో శివాణి, రేణుక, రాజ్‌కుమార్‌ను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ రాజయ్య, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి దేవరాజం, స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రోహిణి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారిణి సంధ్యారాణిలు పాల్గొన్నారు.

చదవండి: Top 10 Billionaires: అంబానీ.. టాప్‌–10 సంపన్నుల్లో ఏకైక భారతీయుడు.. 23వ స్థానంలో అదానీ

Published date : 10 Aug 2023 03:11PM

Photo Stories