Tarun Bhaskar: చదువుపై ఆసక్తి లేదని నా మిత్రుడుకి చెప్పా.. ఇపుడు ఇలా.. విద్యార్థులతో చిట్‌చాట్
![Tarun Bhaskar told my friend that he is not interested in studies](/sites/default/files/images/2023/04/10/tarunbhaskar-1681128294.jpg)
డైరెక్టర్ కాకపోతే ఏమయ్యేవారు?
నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను డైరెక్టర్ కాకపోతే మంచి చెఫ్‌ని అయ్యేవాడిని. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగంలోకి అడుగుపెట్టాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. బీటెక్ చదువుతుండగా స్టడీపై ఆసక్తి లేదని నా మిత్రుడు కౌశిక్‌కు చెప్పా స్టోరీలు రాయమన్నాడు. ఆవిధంగా షార్ట్‌ఫిల్మ్‌లతో మూవీస్‌లోకి వచ్చాను.
మీకిష్టమైన డైరెక్టర్, మీ రాబోయే సినిమాలు?
నాకు మణిరత్నం, సింగీతం శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం. క్రైమ్ కామెడీతో నేను కీడాకోయి ల పేరుతో ఓ సినిమా చేస్తున్నాను. ‘పెళ్లి చూ పులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల కంటే విభిన్నంగా ఉంటుంది. ఇందులో బ్రహ్మానందం ప్రత్యేకంగా కనిపించనున్నారు.
చదవండి: Inspirational Story: లీనా నాయర్.. ఇది కేవలం పేరు కాదు.. బ్రాండ్
ఇటీవలి కాలంలో మీకు నచ్చిన సినిమా?
నాకు బలగం సినిమా బాగా నచ్చింది. మన సంస్కృతి సంప్రదాయాలను తెలంగాణ యాస కట్టిపడేసింది. కొత్త వారు చేసే సినిమాలను తప్పకుండా ఆదరించండి. నాకు నచ్చిన హీరో హీరోయిన్లు జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు, సమంత.
సినీ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి?
సినీ రంగంలోకి రావాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ఇంటర్నెట్‌లో అన్ని అందుబాటులో ఉన్నాయి. ట్రెయినింగ్ పేరిట డబ్బులు ఖర్చు పెట్టకుండా గూగుల్, యూట్యూబ్‌లో నేర్చుకుంటే చాలు.