Skip to main content

Surplus funds for NABARD schools

- 516 పాఠశాలలకు రూ.59 కోట్లు
NABARD
NABARD

ఆంధ్రప్రదేశ్‌లో మనబడి నాడు–నేడు కింద తొలివిడతలో అభివృద్ధి పనులు చేపట్టిన స్కూళ్లకు కేటాయించిన నిధుల్లో మిగిలిన సొమ్మును నాబార్డు ఆర్థిక సాయంతో పనులు చేపట్టిన స్కూళ్లకు వినియోగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లను ఆదేశించారు. నాడు–నేడు తొలివిడతలో 15,715 స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

నీటి సదుపాయంతో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు కుర్చీలు, బెంచీలు సహా ఫర్నిచర్, గ్రీన్‌చాక్‌బోర్డులు, విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మరమ్మతులు, ప్రహరీలు, కిచెన్‌షెడ్లు, రంగులు వేయడం వంటి వాటికి రూ.3,669 కోట్ల వరకు వెచ్చించింది. ఈ నిధులను పాఠశాలల వారీగా కేటాయించింది. ఆ స్కూళ్లలో పనులన్నీ పూర్తయిన తరువాత పేరెంట్స్‌ కమిటీల వద్ద మొత్తం రూ.59 కోట్లు మిగిలాయి. ఈ సొమ్మును నాబార్డు నిధులతో పనులు చేపట్టిన 516 స్కూళ్లలో కార్యక్రమాలు పూర్తిచేసేందుకు బదలాయించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు.  

Published date : 22 Sep 2021 03:15PM

Photo Stories