ZP High School: విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం
గంట్యాడ ఎంఈఓ కార్యాలయం, బొండపల్లి మండలం గొట్లాం జిల్లాపరిషత్ హైస్కూల్‌లో ఆయా మండలాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో గురువారం నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. నోట్ బుక్స్, వర్క్ బుక్స్ కరెక్షన్స్‌ను ప్రతి ఉపాధ్యాయుడు పూర్తి చేయాలన్నారు. మనబడి నాడు–నేడు కింద పాఠశాలలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యాప్రణాళికను పక్కాగా అమలుచేయాలన్నారు. ప్రతి విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
TET - AP Deputy EO: Trends in Education - మొట్టమొదటి మధ్యాహ్న భోజన పథకం ఎక్కడ ప్రారంభమైంది.
టోఫెల్ పరీక్షలు విధిగా నిర్వహించాలని సూచించారు. 100 శాతం జీఈఆర్ సర్వేను వెల్ఫేర్ అసిస్టెంట్, వలంటీర్ల సహాయంతో పూర్తిచేయాలని సూచించారు. పదోతరగతి ఫెయిలైన విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకోవాలన్నారు. బైజూస్ ట్యాబ్‌లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు, మండల విద్యాశాఖ అధికారులు విజయకుమారి, వెంకటరావు, శోభారాణి, అల్లు వెంకటరమణ, హెచ్‌ఎం ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.