Skip to main content

Admissions: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ అడ్మిషన్ల గడువు పొడిగింపు

braou
braou

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌ గడువు చివరి తేదీని అక్టోబర్‌ 13 వరకు పొడిగించినట్లు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మారోజు రామాచారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు 13 వరకు ప్రవేశాలకై దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్, ఓపెన్‌ ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్‌ పాసైన వారు డిగ్రీలో సంబంధిత కోర్సుల్లో అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. అడ్మిషన్స్‌ పొందేవారు రూ.200ల ఆలస్యపు ఫీజుతో 13 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Published date : 06 Oct 2021 04:28PM

Photo Stories