New Course in Degree: ప్రభుత్వ మహిళా కళాశాలలో కెమిస్ట్రీలో కొత్తగా కోర్సు
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల రసాయన విభాగంలో కొత్తగా ఎనలిటికల్ కెమిస్ట్రీ ఆనర్స్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి సెప్టెంబర్ 12న ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ప్రప్రథమంగా మహిళా కళాశాలలో ప్రారంభిస్తున్న ఈ కోర్సును అభ్యసించడం ద్వారా విద్యార్థినులకు వివిధ రకాల లేబోరేటరీ, ఫార్మా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.
చదవండి: General V Madhusudan Reddy: ఎన్‌సీసీ బలోపేతమే లక్ష్యం.. ప్రతి జిల్లాల్లో ఈ అకాడమీ
ప్రస్తుతం డిగ్రీ మూడో విడతలో బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశాలు జరుగుతున్నాయని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మూడో విడతలో సెప్టెంబర్ 15లోపు రిజిస్ట్రేషన్, 16లోపు సర్టిఫికెట్ల పరిశీలన, 18వ తేదీలోపు వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ 22న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
Published date : 14 Sep 2024 09:19AM
Tags
- Govt Womens College
- New Course in Chemistry
- Analytical Chemistry Honors Course
- Principal Dr VR Jyotsnakumari
- Laboratory
- Pharma
- Degree Admissions
- andhra pradesh news
- Bapatla District Latest News
- New Course in Degree
- Chemistry Department
- new Analytical Chemistry Honors course
- Government Women's College
- GunturDistrict
- September 12
- Principal Dr. VR Jyotsnakumari
- statements
- GunturEducation
- SakshiEducationUpdates