Courses: ఏఎంఎస్‌లో ఒకేషనల్ కోర్సులకు అడ్మిషన్లు
Sakshi Education
ఆంధ్ర మహిళాసభ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఒకేషనల్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో విద్యానగర్ కేంద్రంలో బధిర, మానసిక వైకల్యం గల విద్యార్థులకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. మానసిక వైకల్యం గల వారికి ఎర్లీ ఇంటర్æవెన్షన్ నుంచి ప్రీ ఒకేషనల్ వరకు, బధిరులకు ఎర్లీ ఇంటర్æవెన్షన్ నుంచి 10వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. స్పీచ్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ తదితర సేవల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. వికలాంగులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు సెల్: 9948042648 నంబరుకు సంప్రదించాలని కోరారు.
Published date : 06 Oct 2021 04:36PM