Skip to main content

విద్యార్థులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

రాయగడ: విద్యార్థులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందని బీజేడీ సీనియర్‌ నాయకుడు ఎల్ల కొండబాబు అన్నారు.
Students should be idealized  BJD senior leader Ella Kondababu speaking at Mother Teresa School anniversary event

స్థానిక కస్తూరీనగర్‌లోని మథర్‌ థెరిస్సా పాఠశాల 17వ వార్షికోత్సవం మార్చి 3న‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహించాలన్నారు.

చదవండి: Government Jobs: ప్రభుత్వ కొలువుల్లో సైన్స్‌ కళాశాల విద్యార్థులు

విద్యావేత్త డాక్టర్‌ డీకే మహంతి మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారు ఆసక్తి కనబరిచే రంగంలో ప్రోత్సహించడం విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠాలు చెప్పే గురువులపై ఉందన్నారు. క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మదర్‌ థెరిస్సా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బుడ్డా శంకరరావు మాట్లాడుతూ తమ ట్రస్ట్‌ ద్వారా రెండు విద్యాసంస్థలు నడుస్తున్నాయని పేర్కొన్నారు.

చదవండి: G Kishan Reddy: శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచుకోవాలి

పది మంది పిల్లలతో ప్రారంభించిన ప్రస్థానం ప్రస్తుతం అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిదని తెలియజేశారు. పేద విద్యార్థులకు తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ జై చంద్ర చౌదరి, గౌరవ అతిథులుగా విశ్రాంత ఉపాధ్యాయులు ఎస్‌.శాంతారావు, గోపాల్‌ కృష్ణ పాలో తదితరులు పాల్గొన్నారు.

Published date : 05 Mar 2024 03:20PM

Photo Stories