Admissions: విద్యార్థినుల చదువుకు సోపానం
ప్రస్తుతం స్థానిక టీఎస్‌ఎన్‌ఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని నాలుగు గదుల్లో తరగతులను నిర్వహించడానికి సిద్ధం చేశారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో పాటు తరగతులను నిర్వహించేందుకు లెక్చరర్లను వివిధ జూనియర్ కళాశాలల నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్క రోజు తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. బీబీపేట మండలంలో మొత్తం 11 గ్రామాలు కాగా.. విద్యార్థుల సంఖ్య సైతం ఎక్కువగానే ఉంటుంది.
కానీ కళాశాల ఏర్పడడం కొంత ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు కామారెడ్డి, దోమకొండ, రామాయంపేట, దుబ్బాకలో అడ్మిషన్లు పొందారు. మరికొంత మంది ఆడపిల్లలను చదువుకు దూరభారం ఏర్పడడంతో తల్లిదండ్రులు పైచదువులకు పంపించకుండా బంద్ చేయించారు.
ప్రస్తుతం ఆడపిల్లలకు దూ రాభారం తగ్గడంతో పాటు వారు చదువుకోవడాని కి అనువైన స్థలం దొరకడంతో ఎక్కువగా ఆడపిల్లల అడ్మిషన్లు వస్తున్నాయని లెక్చరర్లు చెబుతున్నా రు. 2021 నవంబర్ 9వ తేదీన కళాశాలను తీసుకువస్తామని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు ప్రకటించారు. సరిగ్గా రెండు సంవత్సరాల్లోనే కళాశాలను ప్రారంభిస్తూ జీవో విడుదల చేశారు.
చదవండి: Govt Schools: ప్రభుత్వ బడిలోనే చదివించాలి
30 కి.మీల వరకే బస్ పాస్ సౌకర్యం
బీబీపేట మండలానికి చెందిన విద్యార్థులు గతంలో జూనియర్ కళాశాలకు వెళ్లాలంటే దోమకొండ, కామారెడ్డికి వెళ్లాల్సిందే. బీబీపేట నుంచి దోమకొండ 15 కి.మీ, కామారెడ్డి 30 కి.మీ. వరకు ఉంటుంది. సమయానికి ఆర్టీసీ బస్సులు సైతం లేకపోవడం, విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడేవారు. ఆర్టీసీ బస్‌పాస్ 30 కి.మీ. వరకు మాత్రమే అవకాశం ఉండడం, దీంతో కామారెడ్డికి ఆర్టీసీ బస్సు ద్వారా వెళ్లాలంటే బీబీపేట వరకే బస్సు సదుపాయం ఉండేది. తుజాల్‌పూర్, మల్కాపూర్, శేరిబీబీపేట విద్యార్థులకు కామారెడ్డి వరకు బస్‌పాస్ సదుపాయం లేకపోవడం వల్ల ఆర్థికంగా భారం పడుతుండేది. కానీ ప్రస్తుతం బీబీపేటలోనే కళాశాల ప్రారంభం కావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Education system: ప్రాథమిక విద్య మరింత పటిష్టం
అడ్మిషన్లు కొనసాగుతున్నాయ్
నూతనంగా ఏర్పాటైన జూనియర్ కళాశాల స్థానిక టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతుంది. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులున్నాయి. అలాగే అడ్మిషన్లు సైతం కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 47 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. లెక్చరర్లను సైతం ఇతర కళాశాలల నుంచి తీసుకొని తరగతులు రేపటి నుంచి ప్రారంభిస్తాము. విద్యార్థులు తరగతులకు హాజరుకావాలి.
– జైపాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, బీబీపేట