Skip to main content

SSA Staff: విద్యాశాఖలో విలీనం చేయాలి

కామారెడ్డి టౌన్‌: సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యోగుల సమ్మె సెప్టెంబ‌ర్ 5న‌ 9వ రోజుకు చేరింది.
SSA Staff
విద్యాశాఖలో విలీనం చేయాలి

 నగరంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి, సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ 18 సంవత్సరాల కాంట్రాక్ట్‌ వ్యవస్థలో దోపిడీకి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: Teacher's Day: గురువుల గురించి గొప్ప‌గా వర్ణించారు

దీక్షకు టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఆయా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు దామోదర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి భాను, ఉపాధ్యక్షులు వీణ, శైలజ, సంతోష్‌రెడ్డి, సంపత్‌, ఆర్గనైజ్‌ సెక్రటరీ రాములు, మాధవి, నాయకుడు కాళిదాస్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.
చదవండి: Education News: విద్య‌ను అందించేందుకు ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌

Published date : 06 Sep 2023 04:33PM

Photo Stories