Teacher's Day: గురువుల గురించి గొప్పగా వర్ణించారు
సాక్షి ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉట్నూర్ కుమురంభీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో మంగళవారం గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో, గురుకులాల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌అసిస్టెంట్లు, ఎస్‌జీటీలను ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మొత్తం 76మంది ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించారు.
Schools for Tribals: గిరిజన విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం
గిరిజన ఆశ్రమ విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విద్యార్థులు నూతన అంశాలపై ఉత్సాహం చూపిస్తారని వారి స్థాయికి అనుగుణంగా బోధించాలని కోరారు. విద్యార్థి తల్లిదండ్రులతో కాకుండా ఎక్కువ కాలం గడిపే ప్రదేశం పాఠశాల అని పాఠశాల వాతావరణం విద్యార్థికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డీడీ దిలీప్‌కుమార్, ఏపీవో పీవీటీజీ భాస్కర్, ఏటీడీవోలు, ఏసీఎంవోలు పాల్గొన్నారు.
● ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయ్