Skip to main content

IICT: డైరెక్టర్‌గా శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు గ్రహీత

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్‌గా డాక్టర్‌ డి.శ్రీని వాసరెడ్డి జూన్‌ 10న పదవీ బాధ్యతలు చేపట్టారు.
Srini Vasareddy as the Director of IICT
ఐఐసీటీ నూతన డైరెక్టర్‌గా డాక్టర్‌ డి.శ్రీని వాసరెడ్డి

IICT డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహి స్తున్న NGRI డైరెక్టర్‌ డాక్టర్‌ వీఎం తివారీ నుంచి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2020 నుంచి జమ్ములోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌ రెడ్డి, ఫిబ్రవరి నుంచి లక్నోలోని CSIR సంస్థ సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. IICT డైరెక్టర్‌గా నియమితు లైన నేపథ్యంలో ఆయన మిగిలిన రెండు సంస్థలకు అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

చదవండి: 

మెడిసినల్‌ కెమిస్ట్రీలో అపారమైన అనుభవం..

ఉస్మానియా వర్సిటీలో పట్టభద్రుడైన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2000లో సింథ టిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశారు. తరువాత షికాగో కాన్సస్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధనలు చేశారు. 2003లో అడ్వినస్‌ థెరప్యూ టిక్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీల్లో కొంతకాలం పని చేసి 2010లో పుణేలోని నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీలో చేరారు. మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఔషధ ఆవిష్కరణల్లో శ్రీనివాస రెడ్డికి 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు సుమారు 120 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. పంటల పరిశోధన రం గంలోనూ కృషి చేశారు. శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డుతో పాటు జేసీ బోస్‌ ఫెలోషిప్‌ కూడా అందుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో సభ్యులు.

Published date : 11 Jun 2022 05:31PM

Photo Stories