Skip to main content

సాన్స్ పేరుతో ఐఐసీటీ సరికొత్త మాస్క్

చిన్న చిన్నతుంపర్లను సైతం అడ్డుకోగలిగే సరికొత్త మాస్క్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. సాన్స్ పేరు గల ఈ మాస్కు అత్యధిక నాణ్యతతో పాటు 2కంటే ఎక్కు వ పొరలు కలిగి ఉంటుంది. దీన్ని చౌక ధరకే తయారు చేయొచ్చు.
Edu news

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మాస్క్ లను పెద్దఎత్తున పంచేందుకు దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా తన ఫౌండేషన్ ద్వా రా ముందుకొచ్చింది. ఈ మాస్కుల తయారీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్‌ శైలజ తెలిపారు.

టీ కణాలపై అధ్యయనం..
యాంటీబాడీస్‌ లేనివారిలో టీ–కణాలుంటాయని, అవి కరోనా నుంచి కోలుకున్న బాధితులను కాపాడు తాయని అంతర్జాతీయ అధ్యయనం తేల్చి చెప్పింది. యూకేలోనికరోలిన్ స్కా, కార్డిఫ్‌ యూనివర్సిటీలు కలిసి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తక్కువ లక్షణాలతో కరోనా నుంచి రికవరీ అయిన రోగులపై టీ సెల్‌ ఆధారిత రోగనిరోధక శక్తి గురించి చేసిన ఈ పరిశోధన వివరాలు మెడారిక్స్‌ఐవీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్లీ వైరస్‌ వచ్చినట్లు పరిశోధనలో ఎక్కడా గుర్తించలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: సాన్స్ పేరుతో సరికొత్త మాస్క్ రూపకల్పన
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : ఇండియన్ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)
Published date : 05 Aug 2020 05:56PM

Photo Stories