Skip to main content

ఫ్లూరోఫోర్స్ తయారీలో ఐఐసీటీ విజయం

జీవకణాల్లోని మైటోకాండ్రియాకు అతుక్కుపోయి వెలుగులు విరజిమ్మే ప్రత్యేక ఫ్లూరోఫోర్స్ తయారీ లో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) విజయం సాధించింది.
Current Affairsవ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కీలకమైన ఈ ఫ్లూరోఫోర్స్ తయారీ హక్కులను టోక్యో కెమికల్ ఇండస్ట్రీ (టీసీఐ) కంపెనీకి అందించినట్లు ఐఐసీటీ ఫిబ్రవరి 5న ఓ ప్రకటనలో తెలిపింది. డాక్టర్ సూర్యప్రకాశ్ నేతృత్వం లోని శాస్త్రవేత్తల బృందం ఈ ఫ్లూరోఫోర్స్‌ను అభివృద్ధి చేసింది.

మైటోకాండ్రియా పరిస్థితిని తెలుసుకునేందుకు ఇప్పటివరకు విద్యుదావేశమున్న ఫ్లూరోపోర్స్‌ను ఉపయోగించేవారు. వీటిని ప్రత్యేక పరిస్థితుల్లోనే నిల్వచేయాలి. పైగా వీటిని వాడితే కణ స్థాయి లో విష ప్రభావం కనిపిస్తుంది. ఐఐసీటీ సిద్ధం చేసిన ఫ్లూరోపోర్స్‌లో ఇలాంటి సమస్యలేవీ ఉండవు. గది ఉష్ణోగ్రతల్లో స్థిరంగా ఉండటమే కాకుండా.. సురక్షితమైన పదార్థంతో తయారు చేయడం వల్ల విష ప్రభావాలూ ఉండవు. పైగా విద్యుదావేశం అవసరం లేకుండానే మైటో కాండ్రియాలకు అతుక్కుపోగలవు.
Published date : 15 Feb 2021 11:58AM

Photo Stories