Skip to main content

సముద్ర జీవులపై పరిశోధనకు సీఎస్ఐఆర్–ఎన్ఐవో చేపట్టిన ప్రాజెక్టు పేరు?

సముద్ర గర్భంలోని జీవుల జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్ చేయడమే లక్ష్యంగా.... కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(సీఎస్ఐఆర్–ఎన్ఐవో) ఓ ప్రాజెక్టును చేపట్టింది.
Current Affairs
ప్రాజెక్టులో భాగంగా హిందూ మహాసముద్రంలో కంటికి కనిపించని జీవరాశులు ఎన్ని రకాలున్నాయి, లోహాలు, వాతావరణ పరిస్థితులు, బ్యాక్టీరియా తదితరాలను అన్వేషించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘ట్రేస్‌ బయోమీ’ అని పేరు పెట్టారు.

ప్రాజెక్టు విశేషాలు...
  • ట్రేస్‌ బయోమీ ప్రాజెక్టు కోసం... ఆర్‌వీ సింధు సాధన నౌకలో విశాఖ నుంచి మార్చి 15న సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవోకి చెందిన 30 మంది శాస్త్రవేత్తల బృందం సముద్రంలోకి బయల్దేరింది.
  • 30 మంది శాస్త్రవేత్తల బృందం 90 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించనుంది. వీరి యాత్ర దాదాపు 9,000 నాటికల్‌ మైళ్ల దూరం సాగనుంది. మే నెలలో గోవాలో వీరి పరిశోధన ముగియనుంది.
  • ఒక జీవి పుట్టుక, పెరుగుదల, జీవితచక్రం విశేషాలపై పరిశోధన, నీటిలో ఉన్న లోహనిక్షేపాల వివరాలతో పాటు అవక్షేపాలు ఎంత మేర ఉన్నాయనే దానిని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు.
  • సముద్ర గర్భంలోని నీటి సాంద్రత, ఫ్లోరైడ్, వాటర్‌ టోటల్‌ హార్డ్‌నెస్, పీఏ లెవల్స్‌ ఎంతమేర ఉన్నాయి? జీవరాశులకు అవసరమైన ఆహారముందా? లేదా? మొదలైన వాటిపై పరిశోధనలు నిర్వహిస్తారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ట్రేస్‌ బయోమీ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషినోగ్రఫీ(సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : సముద్ర గర్భంలోని జీవుల జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్‌ చేయడమే లక్ష్యంగా...
Published date : 23 Mar 2021 06:16PM

Photo Stories