Skip to main content

ఐఐసీటీకి జాతీయ అవార్డు

ప్లాస్టిక్‌ తయారీతో పాటు, ఫార్మా రంగంలోనూ కీలకమైన 2 పదార్థాలను సమర్థంగా తయారు చేయగల పద్ధతిని అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)కి టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డు జాతీయ అవార్డు లభించింది.
Current Affairs
‘పీ–టెర్ట్‌ బ్యుటైల్‌ టౌలీన్‌’(పీటీబీటీ), ‘పీ–టెర్ట్‌ బ్యుటైల్‌ బెంజోయిక్‌ ఆసిడ్‌’ (పీటీబీబీఏ) అనే ఈ 2 పదార్థాలను ఇప్పటివరకూ దిగుమతి చేసుకోవాల్సిఉండగా.. ఐఐసీటీ అభివృద్ధి చేసిన టెక్నాలజీల కారణంగా మరింత నాణ్యమైన పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోగల అవకాశం ఏర్పడింది. ఈ రెండు రసాయనాలకు దేశీయంగా రూ.25 కోట్ల మార్కెట్‌ ఉండటం గమనార్హం. ఐఐసీటీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీకాంతంతోపాటు డాక్టర్‌ టి.ప్రతాప్‌ కుమార్, డాక్టర్‌ బి.సత్యవతి, డాక్టర్‌ ప్రవీణ్‌ లిఖర్‌ తదితరులు టెక్నాలజీల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి: ఐఐసీటీకి జాతీయ అవార్డు
ఎప్పుడు: జూన్ 21
ఎవరిచ్చారు : టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డు
ఎక్కడ: ఇండియన్‌ గ్రాండ్‌ఫ్రీ–4 అథ్లెటిక్స్‌ మీట్, పాటియాలా
Published date : 22 Jun 2021 04:51PM

Photo Stories