Skip to main content

TS Schools Summer Holidays 2023 : స్కూళ్లకు 48 రోజులు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. అలాగే ఏడాది సెల‌వుల‌ పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్ర‌త రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. అలాగే స్కూల్స్ పిల్ల‌లు కూడా అనేక ఇబ్బందులకు గురి అవుతూ అనారోగ్యాలు పాలవుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది.
TS Schools Summer Holidays news in telugu
TS Schools Summer Holidays Details

ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ప్ర‌భుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని వెల్లడించింది. దీంతో మొత్తం స్కూళ్లకు 48 రోజులు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఒక వేళ ఆ స‌మ‌యంలో ఎండ తీవ్ర‌త ఎక్క‌వ‌గా ఉంటే ఈ సెల‌వుల‌ను పొడిగించే అవ‌కాశం ఉంది.

➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

తిరిగి పాఠ‌శాల‌ల‌ను..

ts school summer holidays 2023 telugu news

సెలవుల తర్వాత 2023-24 విద్యాసంవ‌త్స‌రానికి గానూ జూన్ 12న పాఠ‌శాలలు తిరిగి తెరుచుకోనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఒకటి నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఎగ్జామ్స్ ను ఏప్రిల్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ఒక‌టి నుంచి ఐదో త‌ర‌గ‌తి విద్యార్థులకు ఉద‌యం 9:30 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు ప‌రీక్ష‌లు ఉంటాయి. 6 నుంచి 8 త‌ర‌గ‌తుల‌ విద్యార్థులకు 9:30 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల వ‌ర‌కు ఉంటాయి. ఏప్రిల్ 21వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు ప‌రీక్షా ప‌త్రాల వాల్యుయేషన్ ఉంటుంది. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఆఖరి రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల మార్కులు ప్రకటించి వేసవి సెలవులు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

➤ TS 10th Class Model Papers Ebook 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేప‌ర్స్ (TM & EM)

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మాత్రం..
తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కూడా ముందుగానే ఏప్రిల్ 14వ తేదీ నుంచే సెల‌వులు రానున్నాయి.

➤ AP & TS 10th Class Study Material PDF 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్ ( TM & EM)

ఈ ఏడాది సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..
సాధారణ సెలవులు ఇవే..
☛ జనవరి 1 : నూతన సంవత్సరం
☛ జనవరి 14 : భోగి
☛ జనవరి 15 : సంక్రాంతి
☛ జనవరి 26 : గణతంత్ర దినోత్సవం
☛ ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి
☛ మార్చి 7 : హోళీ
☛ మార్చి 22 : ఉగాది
☛ మార్చి 30 : శ్రీరామనవమి
☛ ఏప్రిల్ 5 : బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
☛ ఏప్రిల్ 7 : గుడ్ ఫ్రైడే
☛ ఏప్రిల్ 14 : అంబేడ్కర్‌ జయంతి
☛ ఏప్రిల్ 22 :  రంజాన్‌
☛ ఏప్రిల్ 23 : రంజాన్ తదుపరి రోజు
☛ జూన్ 29 : బక్రీద్
☛ జులై 17 : బోనాలు
☛ జులై 29 : మొహర్రం
☛ ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం
☛ సెప్టెంబరు 7 : కృష్ణాస్టమి
☛ సెప్టెంబరు 18 : వినాయక చవితి
☛ సెప్టెంబరు 28 :  మిలాద్‌-ఉన్‌-నబి
☛ అక్టోబర్ 2 :   గాంధీ జయంతి
☛ అక్టోబర్ 14 : బతుకమ్మ ప్రారంభం
☛ అక్టోబరు 24 : విజయదశమి
☛ అక్టోబరు 25 : విజయదశమి తర్వాతి రోజు
☛ నవంబర్ 12 : దీపావళి
☛ నవంబర్ 27 : కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
☛ డిసెంబరు 25 : క్రిస్మస్
☛డిసెంబర్ 26 : బాక్సింగ్ డే

ఇంటర్ :  ఇంటర్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

సెలవుల పూర్తి వివ‌రాలు ఇవే..

Holidays Happy News telugu

Tealangana Holidays 2023TS Government Holidays 2023Holidays Newsholidays news telugu

టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్  | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

Published date : 30 Mar 2023 01:56PM

Photo Stories