Skip to main content

Andhra Pradesh: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ కులాల పేద విద్యార్థులకు ఈ ప‌థ‌కాలు

అనంతపురం అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ కులాల విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించి, వారు అత్యున్నత స్థానాల్లో స్థిరపడేందుకు జగనన్న ప్రభుత్వం తోడ్పాటునందిస్తోంది.
BC Students in Anantapur Urban  Jaganna Govt Boosts Education for All in Anantapur Urban  schemes are for poor students    Jaganna Govt Backs Higher Ed for SC Students

ప్రతిభ ఉన్న వారు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలో ఆపకూడదని, వారు కన్న కలను సాకారం చేసుకోవడానికి, ఎంచుకున్న లక్ష్యం చేరుకోవడానికి చేయూతనందిస్తోంది. ప్రపంచ అత్యున్నత శ్రేణి యూనివర్సిటీల్లో విద్యనభ్యసించేందుకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ ద్వారా బాటలు వేసింది. సివిల్స్‌ సాధనలో భాగంగా సన్నద్ధమయ్యే క్రమంలో కోచింగ్‌, స్టడీ మెటీరియల్‌కు ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’ కింద ఆర్థిక సహకారంతో వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది.

చదవండి: National Scholarship Scheme: నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

జగన్‌ సర్కారు ఉన్నత సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు, యువత చదువు– ఉద్యోగాల్లో రాణించాలని కలెక్టర్‌ గౌతమి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ‘జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రొత్సాహకం కింద అర్హులైన వారికి ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని, సివిల్స్‌ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆర్థిక సహాయాన్ని జమ చేశారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, ఏడీసీసీ బ్యాంక్‌ చైర్‌పర్సన్‌ లిఖిత, అధికారులు పాల్గొన్నారు.

చదవండి: Griffith University Scholarship: గుంటూరు యువకుడికి ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్‌

ఈ సందర్భంగా జిల్లా నుంచి సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలో పాసై మెయిన్స్‌కు అర్హత సాధించిన ఏడుగురు అభ్యర్థుల (జవహర్‌ చంద్రదీప్‌ –ఎస్సీ, వరుణ్‌కుమార్‌ నాయక్‌ –ఎస్టీ, గురుసాయి మంజునాథ్‌ –ఈబీసీ, మనీషా –ఓసీ, అనిల్‌ కుమార్‌రెడ్డి –ఈబీసీ, ఓంకుమార్‌రెడ్డి –కాపు, మధుసూదన్‌ –బీసీ)కు ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.7లక్షల ఆర్థికసాయం మంజూరైంది. అలాగే ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కింద ఎంపికై న ఐదుగురు విద్యార్థులకు రూ.54,40,142 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరైంది.

రెండు పథకాలకు సంబంధించి రూ.61,40,142 మెగాచెక్కును విడుదల చేశారు. సివిల్స్‌ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను అభినందించారు. కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాల్లోని విద్యాకుసుమాలకు ఉన్నత విద్యను అందించి వారికి భవిష్యత్తుకు సీఎం జగన్‌ బంగారు బాట వేస్తున్నారన్నారు. సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ప్రభుత్వమందించిన ఆర్థిక తోడ్పాటును సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు పాల్గొన్నారు.

sakshi education whatsapp channel image link

Published date : 21 Dec 2023 12:57PM

Photo Stories