Skip to main content

National Scholarship Scheme: నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Financial aid for Vanaparthi students  Tribal students in Vanaparthi district   Educational support announcement  Invitation of applications for National Scholarship   National Scholarship Scheme 2023-24

పెబ్బేరు రూరల్‌: ఉన్నత విద్య అభ్యసిస్తున్న వనపర్తి జిల్లా గిరిజన విద్యార్థులు 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. www.scholerships.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జాతీయస్థాయి హాకీ జట్టుకు జిల్లా క్రీడాకారులు
పెబ్బేరు రూరల్‌: జిల్లాకేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులు హర్షిత, హసీన జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ జనార్దన్‌గౌడ్‌, పీడీ రాధ తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు జిల్లాకేంద్రంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు నుంచి పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది.
 

sakshi education whatsapp channel image link

Published date : 21 Dec 2023 10:41AM

Photo Stories