Skip to main content

Jagananna Vidya Deevena: సొమ్ము విడుదల.. విద్యార్థులు ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో..

విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు ఫలితాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Release of jagananna vidya deevena Money
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఇందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లకు ఆరున్నర లక్షల మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించాలని పేద తల్లిదండ్రులకు సూచించారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి దీవెన ఇస్తామని తెలిపారు. మార్చి 16న‌ ఆయన సచివాలయం నుంచి జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇవాళ 100 శాతం అక్షరాస్యత ఉన్న సమాజంలో మాతా, శిశు మరణాలు తక్కువగా ఉంటాయని, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. ‘ఒక ఊళ్లో ఒక పిల్లవాడు డాక్టర్‌ అయితే ఆ కుటుంబం బాగు పడటమే కాకుండా ఆ గ్రామం కూడా బాగు పడుతుంది. పెద్ద పెద్ద డాక్టర్లు చిన్న చిన్న గ్రామాల నుంచి వచి్చ, పై స్థాయికి వెళ్లిన తర్వాత కూడా ఆ గ్రామాలను గుర్తు పెట్టుకుని మంచి చేయడానికి తాపత్రయ పడతారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్న వాళ్లు.. వాళ్ల గ్రామాలకు మేలు చేయడానికి అక్కడి నుంచి డబ్బులు పంపించడం చూస్తున్నాం. వారు ఉన్నత విద్య అభ్యసించడమే దీనికంతటికీ కారణం’ అని వివరించారు. అందువల్లే మన పిల్లల చదువులకు పేదరికం అడ్డు రాకూడదని, డబ్బులు లేక చదువులు ఆపేసే పరిస్థితి రాకూడదని గట్టిగా నమ్మి అండగా నిలుస్తున్నామన్నారు. 

చదవండి: 

​​​​​​​Education: 100% గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు నేనిచ్చే ఆస్తి చదువే: సీఎం జగన్‌

‘అధిక ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు’

పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన

నా కళ్ల ముందు మెదిలే ఘటన 

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనే అంశం మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచి్చనా, నా కళ్ల ముందు ఒక ఘటన మెదలుతుంది. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు జరిగిన ఘటన అది. ఓ కాలేజీలో ఫీజు దాదాపు రూ.లక్ష ఉంటే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా దాదాపు రూ.30 వేలు మాత్రమే వచి్చన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో చదువు సాగించలేనని ఓ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పిల్లాడి తండ్రి నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పారు. ‘రూ.30 వేలు మాత్రమే అందిస్తే, మిగిలిన రూ.70 వేలు ఎక్కడ నుంచి తేగలగాలి.. నా తల్లిదండ్రుల మీద భారం అవుతుంది’ అనుకుని ఆ పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక సంవత్సరం కిందా మీదా పడి తండ్రి రూ.70 వేలు సమకూర్చినా, రెండో సంవత్సరం పరిస్థితి ఏమిటి? అని ఆ విద్యార్థి ఆలోచించాడు. తండ్రితో ఆ భారాన్ని మోయించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజుకూ నేను ఆ ఘటనను మర్చిపోలేను. అందుకే ఆ పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదు.. నా చిట్టిచెల్లెళ్లు, తమ్ముళ్లు గొప్పగా చదివేలా చూడాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రాకూడదని ఇంతకు ముందు నాకన్నా గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్నగారు (వైఎస్సార్‌) అనే చెప్పాలి. ఆ రోజుల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దిశగా అడుగులు వేశారు’ అని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

తర్వాత పాలకులు మొక్కుబడిగా..

 • నాన్న చనిపోయిన తర్వాత వచి్చన పాలకులు మొన్నటి వరకూ.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు మొక్కుబడిగా.. అదీ ఎప్పుడో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. ఈ పథకాన్ని మొత్తం నాశనం చేసే పరిస్థితుల్లోకి తీసుకుపోయిన తర్వాత మన ప్రభుత్వ వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం.
 • 2017–18, 2018–19 సంవత్సరాలకు ఏకంగా రూ.1,778 కోట్లు బకాయిలు పెడితే, పిల్లలకు ఇబ్బంది కలగకూడదని మనం చిరునవ్వుతో చెల్లించాం. 
 • దేశంలో ఎక్కడా లేని విధంగా, అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒక సారి డబ్బు విడుదల చేస్తున్నాం.
 • దీనికితోడు ‘వసతి దీవెన’ అనే గొప్ప ఆలోచన చేశాం. దీని కింద వసతి, భోజనం కోసం పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు చదివే పిల్లలకు రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ చదివే పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదివే పిల్లలకు రూ.10 వేలు ఏడాదికి రెండు దఫాలుగా ఇస్తున్నాం.

మన ప్రభుత్వం ఇలా..

 • జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు గత ప్రభుత్వం ఉంచిన బకాయిలతో కలుపుకుని మన ప్రభుత్వం రూ.9,274 కోట్లు ఖర్చు చేసింది. దీంతో పాటు తొలిసారి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి, వారిని భాగస్వామ్యులను చేస్తూ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. 
 • అక్టోబర్, నవంబరు, డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఇవాళ ఇస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి మే నెలలో చెల్లిస్తాం. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే ఆలస్యం లేకుండా ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం ద్వారా కాలేజీలో జవాబుదారీతనం పెరుగుతుంది. అక్కడ వసతులపై ప్రశి్నంచే హక్కు వారికుంటుంది. 
 • వసతి దీనెన కింద మనం ప్రతి విద్యారి్థకి ఇస్తున్న రూ.20 వేలలో ఇప్పటికే రూ.10 వేలు ఇచ్చాం. రెండో విడత ఏప్రిల్‌ 5న ఇస్తాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా ప్రజల్లోకి వెళ్లి దీన్ని అందజేస్తాం. ఇది కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వేస్తాం. 

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు 

 • మనం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లలో 2018–19లో 37.50 లక్షల మంది విద్యార్థులు ఉంటే, ఈ రోజు 43.60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. సీటు కోసం సిఫారసు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ‘నాడు–నేడు’ అనే గొప్ప కాన్సెస్ట్‌తో సూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. 
 • గతంలో క్లాస్‌ టీచర్లకే దిక్కు లేని పరిస్థితుల నుంచి ఏకంగా ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేక టీచర్‌ను తీసుకొచ్చే గొప్ప ప్రక్రియను తీసుకొస్తున్నాం. మొత్తం ఇంగ్లిష్‌ మీడియం చదువులు తీసుకొస్తున్నాం. సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొస్తున్నాం. నాడు–నేడుతో క్షేత్ర స్థాయిలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. 
 • ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురే‹Ù, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హయ్యర్‌ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌ చైర్మన్ హేమచంద్రారెడ్డి, స్కూల్‌ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఎన్నో మార్పులు.. సత్ఫలితాలు

 • గతంలో పిల్లలకు పుస్తకాలు ఎప్పుడిస్తారో తెలియదు. స్కూళ్లు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత కూడా పుస్తకాలు ఇవ్వని పరిస్థితి. ఇవాళ స్కూళ్లు మొదలయ్యే సమయానికే పిల్లలందరికీ జగనన్న విద్యా కానుక పేరుతో మూడు జతల బట్టలు, స్కూల్‌ బ్యాగు, బైలింగ్వల్‌ (ద్వి భాష) టెక్టŠస్‌ బుక్స్, నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, షూ ఇస్తున్నాం. 
 • స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్నం పూట జగనన్న గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో బలవర్థక ఆహారం అందిస్తున్నాం. పిల్లల మెనూ గురించి ఇంతగా ఆలోచించిన ముఖ్యమంత్రి బహుశా ఎవరూ ఉండరు. గతంలో మిడ్‌ డే మీల్‌ సరుకులకు, ఆయాలకు 7, 8 నెలల వరకు డబ్బులు ఇచ్చేవారు కాదు. 
 • ఆ పరిస్థితిని ఇవాళ పూర్తిగా మార్చేశాం. భోజన పథకానికి గతంలో రూ.600 కోట్లు అయితే, ఈ రోజు రూ.1,800 కోట్లు అవుతోంది. అమ్మఒడి, ఇతర పథకాలన్నింటి వల్ల ఎన్ రోల్‌మెంట్‌ను గణనీయంగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం.
 • ఉన్నత విద్యలో జాబ్‌ ఓరియెంటెడ్‌ సిలబస్, అప్రంటిస్‌షిప్‌ విధానం అమలు దిశగా అడుగులు పడ్డాయి. వీటన్నింటి వల్ల పిల్లలకు మంచి జరగాలని ఆరాటపడుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను.

విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు లిమిట్స్‌ లేవు. ఎంత మంది పిల్లలుంటే అంత మందినీ చదివించండి. అందరికీ ఇస్తాం. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మంచి అన్నగా.. తమ్ముడిగా, పిల్లలకు మంచి మేనమామగా ఇచ్చే కానుక ఇది. దీనివల్ల పిల్లలందరికీ సంపూర్ణంగా మంచి జరగాలని మనసారా కోరుతున్నాను. 
– సీఎం వైఎస్‌ జగన్ ​​​​​​​

ఐపీఎస్‌ అవ్వాలనుకుంటున్నా

విద్యా దీవెనకు రూపకల్పన చేసిన మీకు(సీఎం) ధన్యవాదాలు. మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మా నాన్న ట్రాక్టర్‌ డ్రైవర్‌. అమ్మ కూలీ పనికి వెళ్తోంది. ఇదివరకు మా పెద్దక్కకు ఇలా చదువుకునే అవకాశం లేక మధ్యలోనే ఆపేసింది. ప్రస్తుతం నాతో పాటు మా చెల్లి కూడా చదువుకుంటోంది. తనకు విద్యా కానుక, అమ్మ ఒడి వస్తోంది. ఇతర పథకాలూ అందుతున్నాయి. బాగా చదివి ఐపీఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకుంటున్నాను.
– సవర ఇందు, డిగ్రీ థర్డ్‌ ఇయర్, శ్రీకాకుళం 

Published date : 17 Mar 2022 12:20PM

Photo Stories