Philatelic Account: విద్యార్థుల నైపుణ్యానికి పోస్టాఫీస్ ఫిలాటలీ దోహదం.. ఫిలాటలీ ఖాతా అంటే ?
ఈ ఖాతాతో విద్యార్థుల్లో నైపుణ్యం, నాలెడ్జ్ పెంచేందుకు ఎంతో దోహదపడనుంది. తపాలా శాఖకు సంబంధించి స్టాంప్‌ల సేకరణ చేసే అలవాటు ఉన్న పిల్లలతో పాటు, అలవాటు లేని పిల్లలకు ఫిలాటలీ ఖాతా తెరిపించి వారిలో ప్రతిభా పాఠాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటోంది.
ఫిలాటలీ ఖాతా అంటే ....
ఫిలాటలీ ఖాతాను రూ. 200తో పోస్టాఫీస్‌లో తెరువాలి. ఖాతా తెరిచిన విద్యార్థికి వెంటనే రూ.150ల విలువ గల స్టంప్‌లు ఇస్తారు. మిగిలిన రూ. 50 ఖాతాలో ఉంటాయి. ఈ ఖాతాలో మళ్లీ డబ్బులు జమ చేస్తే పోస్టాఫీస్‌కు కొత్తగా వచ్చే స్టాంప్‌లను ఆ విద్యార్థి ఇంటికి పోస్ట్ ద్వారా పంపుతారు. స్టాంప్‌లపై ఉండే మహనీయుల బొమ్మలు, స్టాంప్‌లపై ఉన్న చిత్రాలకు సంబంధించిన చరిత్ర స్టాంప్‌ల వెనుకాల ఉంటుంది. ఈ చరిత్ర గురించి తెలుసుకోవడమే ఫిలాటలీ ఉద్దేశం.
చదవండి: 12,828 Postal Jobs : పది పాసైతే చాలు.. పోస్టల్‌లో ఉద్యోగం.. పూర్తి వివరాలు ఇవే..
దీన్ దయాళ్ స్పర్శ్ కింద స్కాలర్ షిప్‌లు..
ఫిలాటలీ ఖాతా ఉన్న విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన కింద నిర్వహించే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఫిలాటలీ ఖాత తెరిచే అవకాశం ఉంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆ సంవత్సరం దీన్ దయాళ్ స్పర్శ్ యోజన కింద రూ. 6వేలు స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.
దరఖాస్తు ఎలా..
విద్యార్థులు తమకు దగ్గరలోని పోస్టాఫీసుల్లో దరఖాస్తుల ఫారాలను నింపి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 24న పరీక్ష ఉంటుంది. మొత్తం అయిదు సబెక్టులకు 50 మార్కులు. కరెట్ అఫైర్స్‌కి 5 మార్కులు, లోకల్ ఫిలాటలీకి 10, హిస్టరీకి 5, జాతీయ ఫిలాటలీకి 15, జియోగ్రఫీకి 5, సైన్స్‌కు 5, స్పోర్ట్స్, కల్చరల్‌కు 5 మార్కులు ఉంటాయి.