Skip to main content

Sakshi Excellence Awards: సాక్షి’ఎక్స్‌లెన్స్‌ అవార్డు.. కేటగిరీలు వారిగా ఇలా..

సాక్షి,హైదరాబాద్‌: ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం.’అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
Sakshi Excellence Awards   Trophy for Sakshi Excellence Award   Celebration of talent at Sakshi Excellence Awards

 త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’ వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల’ కోసం ఎంట్రీలను ఆహ్వనిస్తోంది. 2023కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు.

అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు మార్చి 30, 2024  సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా  ఎంట్రీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి.

చదవండి: Best Education and Jobs For AP Students : విద్య, ఉపాధిలో ఏపీ దేశంలోనే టాప్‌.. 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండానే.. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు..

సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసిం చడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే.

ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’ అభిలషిస్తోంది. ‘సాక్షి’ చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్‌ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–23256134 నంబర్‌పై గానీ,  మెయిల్‌ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com

కేటగిరీలు ఇలా:

ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్‌) 

  • ఎక్స్‌లెన్స్‌  ఇన్‌ ఎడ్యుకేషన్‌
  • ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌ డెవలప్‌ మెంట్‌     
  • ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ హెల్త్‌ కేర్‌ – వ్యక్తి/ సంస్థ     
  • ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌     
  • బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌– లార్జ్‌ స్కేల్‌
  • బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌    – స్మాల్‌/ మీడియం
  • ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – ఇండివిడ్యువల్‌     
  • ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌– కార్పొరేట్‌     
  • ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – ఎన్‌జీఓ

యంగ్‌ అచీవర్స్‌ (జ్యూరీ బేస్డ్‌)         

  • యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌         – ఎడ్యుకేషన్‌     
  • యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌         – సోషల్‌ సర్వీస్‌      
  • యంగ్‌  అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – ఇండివిడ్యువల్‌     
  • యంగ్‌  అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌          ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – కార్పొరేట్‌
  • యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌      ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – ఎన్‌జీఓ
     
Published date : 30 Jan 2024 11:30AM

Photo Stories