Skip to main content

TPTF: టీచర్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి...

విద్యారణ్యపురి : టీచర్ల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు.
TPTF
టీచర్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి...

ఈ మేరకు ఆగ‌స్టు 3న‌ హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్‌ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ ఆగ‌స్టు 5న టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో హనుమకొండ జెడ్పీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నామన్నారు.

చదవండి: Teacher Jobs: టీచర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఈకార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2006–2007 నుంచి 2021–2022 వరకు జెడ్పీజీపీఎఫ్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 2,741.82 కోట్ల వడ్డీ బకాయి వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీజీపీఎఫ్‌ ఖాతాల్లో మిస్సింగ్‌ క్రెడిట్‌ ఉన్న సుమారు రూ. 1000 కోట్లు సరి చేసి ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.

చదవండి: Age limit: అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంపు..

సమావేశంలో ఉపాధ్యాయ దర్శిని సంపాదకుడు వి అజయ్‌బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు జె స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి మనోజ్‌, పూర్వ ఉమ్మడి వరంగల్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీ ఉట్కూరు అశోక్‌, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు బి పూర్ణచందర్‌, డి రమేష్‌, దినేష్‌, కిష్టయ్య, కనకస్వామి తదితరులు పాల్గొన్నారు.

Published date : 04 Aug 2023 03:40PM

Photo Stories