Skip to main content

Age limit: అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంపు..

ఏఎన్‌యూ: యూజీసీ పే స్కేల్‌ పొందుతున్న రెగ్యులర్‌ అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచడం హర్షణీయమని వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో యూజీసీ పే స్కేల్‌ పొందుతున్న రెగ్యులర్‌ అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ యూనివర్సిటీ అధ్యాపక సంఘం నూటా ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీలో కృతజ్ఞతాభివందన సభ నిర్వహించారు.
 యూనివర్సిటీ అధ్యాపక సంఘం
యూనివర్సిటీ అధ్యాపక సంఘం

వీసీ మాట్లాడుతూ అధ్యాపకుల వయోపరిమితి పెంపు వలన విద్యార్థులకు మరిన్ని సేవలు అందించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఉన్నత విద్యలో రాష్ట్ర వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెగ్యులర్‌ అధ్యాపకుల నియామకాలు జరిగాయని, నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు జరిగిందన్నారు.

Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాద్‌ మూర్తి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అధ్యాపకుల వయోపరిమితిపై గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రిజిస్ట్రార్‌ ఆచార్య బి.కరుణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమన్నారు. నూటా అధ్యక్షుడు డాక్టర్‌ బి.నాగరాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.సిద్ధయ్య, నూటా కార్యవర్గ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Also read: Open Tenth అభ్యర్థులు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు

Also read: AMC 2023: ఆంధ్ర వైద్య కళాశాలలో అడ్మిషన్లు.. చివరి తేదీ ఇదే..

Published date : 01 Aug 2023 03:15PM

Photo Stories