NTRUHS: మిగిలిపోయిన పీజీ సీట్ల కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్ ల ఆహ్వానం
Sakshi Education
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మిగిలిపోయిన పీజీ రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్ లు ఆహ్వానిస్తూ ఎనీ్టఆర్ వైద్య విశ్వవిద్యాలయం మే 6న నోటిఫికేషన్ విడుదల చేసింది.
మే 6 సాయంత్రం 6 గంటల నుంచి మే 7 ఉదయం 9 గంటల వరకు వెబ్ ఆప్షన్ ల నమోదుకు అవకాశం కల్పించారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 38 సీట్లను కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. అదేవిధంగా బీడీఎస్ అడ్మిషన్ లలో భాగంగా మాప్–అప్ రౌండ్–3 కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మాప్–అప్ రౌండ్–2 అనంతరం 49 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయని, వీటిని రౌండ్–3లో భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
Published date : 07 May 2022 12:21PM