Skip to main content

NTRUHS: హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పోస్టుకు నోటిఫికేషన్‌

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌ను నియమించేందుకు జూలై 19న నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు.
NTRUHS
హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పోస్టుకు నోటిఫికేషన్‌

రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ శంకర్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారన్నారు. ఈ క్రమంలో సీవోఈ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావుకు రిజిస్ట్రార్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించామన్నారు. మెడికల్‌ కళాశాలలో ఐదేళ్లు ప్రొఫెసర్‌ సీనియారిటీ ఉన్న వారు, డిప్యూటీ సెక్రటరీ హోదా ఉన్న వారు, యూనివర్సిటీలో జాయింట్‌ రిజిస్ట్రార్‌ హోదా కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌గా నియామక ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారన్నారు. అర్హులైన వారు జూలై 20 నుంచి ఆగస్టు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

చదవండి: 

Published date : 20 Jul 2022 01:00PM

Photo Stories