Skip to main content

దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం తేదీ ఇదే..

దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన విజయవాడలోని Dr NTR Health University 24, 25వ స్నాతకోత్సవ వేడుకలు జూలై 15న నిర్వహించనున్నారు.
NTRUHS Graduation Ceremony
దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం తేదీ ఇదే..

విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి Chancellor of the University, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ Biswa Bhusan Harichandan అధ్యక్షత వహించనున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్, తిరుపతి స్విమ్స్‌ పూర్వ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ Dr. G Subramaniam ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల్లో ప్రతిభ చూపిన 127 మందికి మెడల్స్‌ అందజేస్తారు. అలాగే, గుండె వైద్యంలో Dr. G Subramaniam చేసిన సేవలకు గాను ఆయనకు హెల్త్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేయనున్నట్లు VC Dr. P Shyam Prasad తెలిపారు.

చదవండి: 

Published date : 13 Jul 2022 01:18PM

Photo Stories