IIM-CAT Notification 2024 : ఐఐఎం–క్యాట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. 21 ఐఐఎంలలో మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులు..
ఇవి అందించే మేనేజ్‌మెంట్ పీజీ, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరాలని కోరుకునే వారి సంఖ్య లక్షల్లోనే!! ఇందుకోసం ఐఐఎంలు ఏటా నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)కు సన్నద్ధమవుతుంటారు. ఇలాంటి వారంతా ఇక తమ ప్రిపరేషన్‌ను మరింత ముమ్మరం చేసుకోవాల్సిన సమయం! కారణం.. క్యాట్–2024 నోటిఫికేషన్ విడుదల కావడమే! ఈ నేపథ్యంలో.. క్యాట్–2024 ప్రత్యేకతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర వివరాలు..
క్యాట్–2024 షెడ్యూల్‌ను దాదాపు నాలుగు నెలల ముందుగానే ప్రకటించారు. అంతేకాకుండా పరీక్షకు మూడు నెలల ముందుగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. ఫలితంగా అభ్యర్థులకు అప్లికేషన్ టెన్షన్ నుంచి ఉపశమనం కలిగి.. పరీక్ష సన్నద్ధతపై పూర్తిగా దృష్టిపెట్టేందుకు వీలుకలుగుతుంది. ఈ ఏడాది నవంబర్ 24న మొత్తం మూడు సెషన్లలో క్యాట్ పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు.
Clerk Jobs : టీఐఎఫ్‌ఆర్‌లో క్లర్క్ పోస్టులు.. అర్హులు వీరే..
మొత్తం 21 ఐఐఎంలు
క్యాట్‌లో ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐఎంలలో పీజీ స్థాయి కోర్సుల్లో (ఎంబీఏ/పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్), పీహెచ్‌డీలో చేరే అవకాశం లభిస్తుంది. దీంతోపాటు ఎండీఐ–గుర్గావ్, ఎఫ్‌ఎంఎస్–ఢిల్లీ, ఐపీఎం తదితర 500కు పైగా పేరున్న మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ అడ్మిషన్ పొందే వీలుంది.
కార్పొరేట్ కెరీర్‌కు మార్గం
క్యాట్ స్కోర్‌తో ఐఐఎం క్యాంపస్‌ల్లో చేరి కోర్సు పూర్తి చేసుకున్న వారికి కార్పొరేట్ కంపెనీలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాయనడంలో సందేహం లేదు. ఎంఎన్‌సీలు మొదలు స్టార్టప్ సంస్థల వరకూ.. ఐఐఎం క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తూ లక్షల ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి. సగటున రూ.35 లక్షల వార్షిక వేతనం దక్కే అవకాశముంది. ఇంటర్న్‌షిప్ సమయంలోనే రెండు నెలల వ్యవధికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు స్టయిఫండ్ లభిస్తుంది.
Backlog posts Exams: SC, ST బ్యాక్‌లాగ్ పోస్టుల అర్హత పరీక్షలు ప్రారంభం
అర్హత
క్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.
మూడు విభాగాల్లో పరీక్ష
క్యాట్ పరీక్షను ఈ ఏడాది కూడా మూడు విభాగాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గత మూడేళ్లుగా పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తున్నారు. ఫలితంగా అభ్యర్థులకు ఆయా విభాగాల్లోని ముఖ్యాంశాలు, ఎక్కువ వెయిటేజీ లభిస్తున్న టాపిక్స్‌పై స్పష్టత వస్తుంది. క్యాట్‌లో మొదటి విభాగంగా వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్; రెండో విభాగంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్; మూడో విభాగంగా క్వాంటేటివ్ ఎబిలిటీ ఉన్నాయి.
NHAI Contract Jobs : ఎన్‌హెచ్‌ఏఐలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు.. వివరాలు ఇలా!
➔ వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 24 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు; క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 22 ప్రశ్నలు చొప్పున మొత్తం 66 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును తగ్గిస్తారు.
➔ ఒక్కో విభాగానికి 40 నిమిషాలు చొప్పున మొత్తం 120 నిమిషాల్లో (రెండు గంటలు) పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయంలో ఒక విభాగం పూర్తయ్యాకే మరో విభాగం సమాధానాలకు ఉపక్రమించాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం
➔ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➔ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2024, ఆగస్ట్ 1 – సెప్టెంబర్ 13
➔ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: 2024,నవంబర్ 5 నుంచి
➔ క్యాట్ పరీక్ష తేదీ: 2024, నవంబర్ 24
➔ ఫలితాల వెల్లడి: 2025, జనవరి రెండో వారంలో.
➔ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://iimcat.ac.in
సన్నద్ధతకు.. సమయమిదే
క్యాట్–2024 పరీక్ష నవంబర్ 24న నిర్వహించనున్నారు. అంటే..ఇప్పటి నుంచి దాదాపు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తే సిలబస్ అంశాలపై పట్టు సాధించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్
ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్ పేరాగ్రాఫ్‌లను ప్రాక్టీస్ చేయాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల కోసం అసెంప్షన్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి.
Posts at NCCBM : ఎన్‌సీసీబీఎమ్‌లో వివిధ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తులు..
డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్
ఇది అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక విశ్లేషణ నైపుణ్యాన్ని పరిశీలించే విభాగం. దీనికోసం టేబుల్స్,గ్రాఫ్స్,చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.లాజికల్ రీజనింగ్‌లో క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో మ్యాథమెటికల్, అర్థమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలంటే..పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్–టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్ మ్యాథ్స్, జామెట్రీపై అవగాహన పెంచుకోవాలి.
Teaching Posts at NCERT : ఎన్‌సీఈఆర్‌టీలో టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు..
కటాఫ్ పర్సంటైల్
క్యాట్ పరీక్షలో ప్రతి సెక్షన్‌లోనూ నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందేలా కృషి చేయడం చాలా అవసరం. ఎందుకంటే.. ఐఐఎంలు మలిదశ ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులను పిలిచేందుకు నిర్దిష్టంగా సెక్షనల్ కటాఫ్, ఓవరాల్ కటాఫ్‌లను పేర్కొంటున్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఓవరాల్ కటాఫ్ కనిష్టంగా 85, గరిష్టంగా 90 పర్సంటైల్ పొందాలి. అదే విధంగా సెక్షనల్ కటాఫ్ 75 నుంచి 80 పర్సంటైల్ వరకూ ఉంటోంది.
కాన్సెప్ట్స్+ ప్రాక్టీస్
క్యాట్‌లో మెరుగైన స్కోర్, పర్సంటైల్ సాధించేందుకు ప్రతి సెక్షన్ కీలకం. కాబట్టి అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తొలుత సిలబస్‌ను పరిశీలించి.. సంబంధిత కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ప్రామాణిక మెటీరియల్‌ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి టాపిక్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి.
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ పౌర పురస్కారం
మాక్, మోడల్ టెస్ట్
క్యాట్‌లో మెరుగైన స్కోర్ సాధించే క్రమంలో అభ్యర్థులు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది. మాక్ టెస్ట్‌ల ఫలితాలను విశ్లేషించుకుని.. తాము ఇంకా అవగాహన పెంచుకోవాల్సిన అంశాలను గుర్తించి వాటిపై మరింత ఎక్కువ దృష్టి సారించాలి. ఇలా సబ్జెక్ట్ ప్రిపరేషన్ సాగిస్తూనే నిరంతరం తమ ప్రతిభను పెంచుకునేలా ప్రాక్టీస్‌కు, నమూనా పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
జీడీ/పీఐకు కూడా
క్యాట్ ఫలితాల ఆధారంగా మలి దశలో ఐఐఎంలు నిర్వహించే ప్రత్యేక ఎంపిక ప్రక్రియలోనూ విజయం సాధించే దిశగా కృషి చేయాలి. క్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుని ఐఐఎంలు తదుపరి దశ ఎంపిక ప్రక్రియ చేపడతాయి.అర్హులైన అభ్యర్థులకు మలి దశలో గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. వీటికి నిర్దిష్ట వెయిటేజీ కేటాయించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆయా ఐఐఎంల గత ప్రవేశ విధానాలను పరిశీలిస్తే.. క్యాట్ స్కోర్‌కు 50 నుంచి 70శాతం,జీడీ/పీఐలకు 30నుంచి 50శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్,పర్సనల్ ఇంటర్వ్యూ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లలోనూ రాణించేందుకు కృషి చేయాలి.
AILET 2025 Notification : యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
Tags
- IIM CAT
- notification
- Entrance Exam
- Indian Institute of Management
- admissions
- IIM Admissions
- IIM admissions 2024
- IIM CAT 2024 Notification
- CAT Exam dates
- CAT Preparation tips
- Eligible students
- online applications
- corporate career
- Education News
- Sakshi Education News
- CAT2024Specialties
- IIMAdmissions2024
- CAT-2024
- Management PG Courses
- IIM Executive MBA programs
- IIM MBA programs
- CAT details
- CAT specialties
- CAT tips