Skip to main content

AILET 2025 Notification : యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్శిటీ ఢిల్లీలో.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్‌ ఇండియా లా ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2025 (ఏఐఎల్‌ఈటీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Notification for All India Law Entrance Test in UG, PG and Ph D Courses

కోర్సులు –సీట్ల వివరాలు
»    యూజీ కోర్సులు: ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌)–120 సీట్లు; బీకాం ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌) నాన్‌–రెసిyð న్షియల్‌ ప్రోగ్రామ్‌–60 సీట్లు.
»    అర్హత: సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌(10+2) ఉత్తీర్ణులవ్వాలి.
»    పీజీ కోర్సులు: ఏడాది నాన్‌ రెసిడెన్షియల్‌ ఎల్‌ఎల్‌ఎం కోర్సు–80సీట్లు,ఎల్‌ఎల్‌ఎం(ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లా అండ్‌ మేనేజ్‌మెంట్‌)–25 సీట్లు.
»    అర్హత: ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    ఎంఏ(ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లా అండ్‌ మేనేజ్‌మెంట్‌)–25 సీట్లు.
»    అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    పీహెచ్‌డీ కోర్సులు: లా, సోషల్‌ సైన్స్‌స్‌ కోర్సులు–31 సీట్లు.
»    అర్హత: ఎల్‌ఎల్‌ఎం/మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా లా ఎంట్రన్స్‌ టెస్ట్‌–2025 ఆ«ధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.11.2024.
»    అడ్మిట్‌ కార్టుల జారీ తేది: 28.11.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 08.12.2024.
»    వెబ్‌సైట్‌: https://nludelhi.ac.in

Scientist B Posts : బీఐఎస్‌లో సైంటిస్ట్-బీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

Published date : 07 Aug 2024 12:00PM

Photo Stories