Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ పౌర పురస్కారం
రెండు రోజుల పర్యటనకుగాను ఫిజీ వెళ్లిన రాష్ట్రపతి ముర్ము ఆగస్టు 6వ తేదీ ఆ దేశ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. భారత్, ఫిజీల మధ్య కొనసాగుతున్న సన్నిహిత సంబంధాలపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడం రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు తార్కాణమని పేర్కొన్నారు. ఫిజీ మరింత బలోపేతమయ్మేందుకు, అభివ`ద్ధి దిశగా సాగేందుకు భారత్ తోడుగా నిలుస్తుందని వెల్లడించారు.
భారత్ ప్రారంభించనున్న ప్రాజెక్టుల్లో ఒకటైన రాజధాని సువాలోని స్పెషాలిటీ కార్డియాలజీ హాస్పిటల్ ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీరుస్తుందని ఆమె అన్నారు. 'ఫిజీ అధ్యక్షుడు రటు విలియమ్ మైవలిలి కటొనివెరె ఆగస్టు 6వ తేదీ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ' తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును గౌరవించారు' అని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Roshni Nadar Malhotra: టెక్ దిగ్గజం రోష్ని నాడార్‌కు అత్యున్నత పురస్కారం