Skip to main content

6th Class Admissions: ‘నవోదయ’ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

Navodaya Vidyalaya Class 6th admission test application date extended to Aug 17

అమలాపురం టౌన్‌: పెద్దాపురం జవహర్‌ నవోదయ విద్యాలయలో 2024–25 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 17వ తేదీ వరకూ గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్‌ కె.రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి ఆదేశాల మేరకు ఈ పొడిగింపు జరిగిందని, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2024 జనవరి 20వ తేదీన జరగబోయే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని ఆయన సూచించారు.

6th Class Admissions in Navodaya Vidyalaya: నాణ్యమైన విద్యకు.. నవోదయం

Published date : 10 Aug 2023 03:53PM

Photo Stories